Overview

ఇండియన్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు Jobs in Meredale, Gauteng, South Africa at AGA Publications Ltd

Title: ఇండియన్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

Company: AGA Publications Ltd

Location: Meredale, Gauteng, South Africa

Indian Bank Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్, 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచులలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ వంటి కీలక హోదాల్లో నియామకాలు జరగనున్నాయి. ముఖ్యంగా డేటా అనలిస్ట్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ మరియు సివిల్ ఇంజనీరింగ్ వంటి విభిన్న విభాగాల్లో అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు.

Read also: Amaravati: అమరావతికి దక్కిన గుర్తింపు.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

Indian Bank has 350 Specialist Officer jobs

అర్హతలు మరియు వయోపరిమితి వివరాలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పటిష్టమైన విద్యా నేపథ్యం కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటితో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత రంగంలో పని అనుభవం కూడా ఉండాలి. వయస్సు విషయానికి వస్తే, ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 23 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత గల వారు ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

Indian Bank Recruitment: ఎంపిక విధానం మరియు దరఖాస్తు ఫీజు

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. తొలుత వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఒకవేళ దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తే రాత పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు రూ.175 గా నిర్ణయించారు. ఈ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ 1, 2, 3 హోదాలో ఆకర్షణీయమైన వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also

RRB NTPC గ్రాడ్యుయేట్ CBT-1 ఆన్సర్ కీ విడుదల

Upload your CV/resume or any other relevant file. Max. file size: 800 MB.